త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- October 15, 2025
అమరావతి: రోడ్డు యక్సిడెంట్లు, పాము కాట్లు, సడెన్ హార్ట్ అటాక్స్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగే సందర్భాల్లో గోల్డెన్ అవర్ అనేది అత్యంత కీలక సమయం. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి తక్షణ వైద్యం అందిస్తే, గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే, గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో, అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఉన్న అంబులెన్స్‌లలో చాలా తరచుగా రిపేర్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సమయానికి వైద్యం అందించడం కష్టం అవుతోంది. ముఖ్యంగా, గ్రామీణ, అందుబాటులోకి దూరమైన ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల సౌలభ్యాన్ని పెంపొందించడానికి, 190 కొత్త 108 అంబులెన్స్‌లు త్వరలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ప్రకటించారు. ఈ కొత్త వాహనాలు గోల్డెన్ అవర్ లో నిరంతర సేవ అందించడానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడున్న అంబులెన్స్‌లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్‌లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్‌లను తొలగిస్తామని చెప్పారు.
వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.త్వరలో ప్రారంంభించనున్న 190 కొత్త 108 వాహనాల్లో.. 56 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, 136 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు నడుస్తున్నాయని.. పాత వాటిని తొలగించి.. కొత్త వాటితో కలిపితే.. వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో అంబులెన్స్‌లు ఉండేవని చెప్పిన సత్య కుమార్.. కొత్త అంబులెన్స్‌లు నేషనల్ అంబులెన్స్ కోడ్ (NAC) ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని వెల్లడించారు.
గత నెలలోనే ప్రభుత్వం ఈ మేరకు పాత రంగులు మార్చుతున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ 108 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంబులెన్స్‌ల నిర్వహణను పట్టించుకోలేదని.. వాల కాలం చెల్లిన అంబులెన్స్ (Ambulance) లను ఉపయోగించిందని అన్నారు.
ఫలితంగా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. 108 అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం పెరిగిందని మంత్రి ఆరోపించారు.2023 జులైలో తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌ల స్థానంలో అప్పటి ప్రభుత్వం 146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించింది. వీటి కోసం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా 2020లో 412 కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా