తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- October 16, 2025
హైదరాబాద్: ప్రైవేటు నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి. 21 కాలేజీలపై ఆరోపణలు రాగా.. వాటన్నింటిలోనూ విస్తృతంగా విచారణ జరిపి నివేదికలను డీఎంఈ కార్యాలయంలో అందించారు. విచారణ అధికారులు అందించిన నివేదికలను డీఎంఈ పరిశీలన అనంతరం చర్యలు తీసుకోనున్నారు. ఒకే భవనంలో అనేక కాలేజీలను నిర్వహించడం సహా. చాలా చోట్ల గుర్తింపు తీసుకున్న అడ్రస్ లో భవనాలు లేవని, సగం నర్సింగ్ కళాశాలలకు పేరెంట్ హాస్పిటల్స్ లేవని డీఎంఈకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ కొనసాగింది. క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే నర్సింగ్ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దుస్థితికి కారణమైన ఈ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ (Nursing) కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు తనిఖీలు పూర్తి చేసి నివేదికలను ఒక్కొక్క బృందం డీఎంఈ కార్యాలయంలో అందచేసినట్లు అధికారులు తెలిపారు. చాలా కళాశాలల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ కూడా కనిపించలేదని విచారణ చేపట్టిన అధికారులు కొందరు తెలిపారు.
చాలా కళాశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు రోజువారీగా క్లాసులు చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఇక తనిఖీలకు (Inspections) వెళ్లిన వారిలో కొందరిని ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు మచ్చిక చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అలాంటి వారిపైన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉన్న చోట అవసరమైతే మరోసారి విచారణ చేపట్టేందుకు ఇతర బృందాలను పంపించేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. వ్యవస్థను సరిచేసేందుకు ఈ వ్యవస్థను నిర్వహించే వారు సక్రమంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 21 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలను నిబంధనం మేరకు నిర్వహించడం లేదని, ఒకచోట అనుమతితో మరోచోట నిర్వహిస్తున్నారని, మౌలిక వసతులు లేవని, ఫ్యాకల్టీ లేకుండానే >>2 కాలేజీలే నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు డిఎంఈ (అకడమిక్స్) డాక్టర్ శివరాం ప్రసాద్ చెబుతున్నారు. 21 కాలేజీలపై విచారణ కోసం 42 మందితో కూడిన బృందాలను పంపించి విచారణ చేయించామని పేర్కొన్నారు. గత ఏడాది ఇలాగే ఆరోపణలు వచ్చిన సందర్భంలో విచారణ తర్వాత ఓ నర్సింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేసి విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశామని, ఇప్పుడు కూడా నిబంధనల మేరకు లేని కాలేజీలపై డిఎంఈ స్థాయిలో లేదా హెల్త్ సెక్రటరీ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్
- హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
- APEX కౌన్సిల్ సభ్యుడిగా తొలి తెలుగు వ్యక్తి చముందేశ్వరనాథ్ ఎన్నిక
- గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- స్టాటిన్ మందుల వినియోగం సేఫా? సౌదీ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!