జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!

- October 17, 2025 , by Maagulf
జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!

టోక్యో: జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డును ఒమన్ అందుకున్నది. విద్యా పరిశోధన మరియు సాంస్కృతిక మార్పిడిని ముందుకు తీసుకెళ్లడంలో గణనీయమైన కృషి చేసినందుకు టోక్యో యూనివర్సిటీ ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు ప్రదానోత్సవం టోక్యోలో జరిగింది. జపాన్‌లోని ఒమన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ బిన్ సయీద్ అల్ బుసైది ఒమన్ ప్రభుత్వం తరపున బహుమతిని స్వీకరించారు.

2011లో యూనివర్సిటీలో స్థాపించిన సుల్తాన్ ఖాబూస్ ఛైర్ ఫర్ మిడిల్ ఈస్టర్న్ స్టడీస్.. మధ్యప్రాచ్య వ్యవహారాలలో పరిశోధన అభివృద్ధికి కీలకమైన వేదికగా పనిచేసింది. షోకుమోన్ అవార్డు టోక్యో యూనివర్సిటీ ద్వారా విద్యా లక్ష్యం మరియు పరిశోధన లక్ష్యాలకు అసాధారణమైన కృషిని ప్రదర్శించే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు ఒమన్ అందుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. బహుమతి చరిత్రలో ఒక అరబ్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుతో సత్కరించబడటం ఇదే మొదటిసారి అని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com