దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- October 17, 2025
యూఏఈ: దుబాయ్‌లో అక్టోబర్ 20న జరుపుకునే దీపావళిని పురస్కరించుకొని కరామా మరియు బర్ దుబాయ్ దారులు వెలుగులతో మెరిసిపోతున్నాయి. ఇళ్లు లైటింగ్ తో కాంతులీనుతున్నాయి. బాల్కనీల వెంట స్ట్రింగ్ లైట్లు, LED దీపాలు మెరుస్తాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని పలు ప్రాంతాలలో రంగురంగుల స్వీట్లు మరియు సావరీల ట్రేలతో స్వీట్స్ దుకాణాలు స్వాగతం పలుకుతున్నాయి.
భారత్, యూఏఈతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఎమిరేట్స్ అంతటా ఉన్న భారతీయ కుటుంబాలు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
తన కుటుంబానికి దీపావళి జరుపుకోవడం అంటే ఎంతో ఇష్టమని గత పద్దెనిమిది సంవత్సరాలుగా UAEలో నివసిస్తున్న గీతాంజలి కుమార్ తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయానికి దూరంగా ఉన్నప్పుడు, తాను మా పిల్లలకు నేర్పించగలిగే సమయం ఇదిఅని పేర్కొన్నారు. దీపావళిని పురస్కరించుకొని ఏటా కమ్యూనిటీ సహాయకులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు మరియు క్లీనర్లకు బియ్యం, పప్పులు మరియు నిత్యావసరాలతో కూడిన చిన్న చిన్న హాంపర్లు తయారు చేసి తమ పిల్లల సహాయంతో అందజేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం వేళలో దీపాలను వెలిగించి, బంధువులు ఫ్యామిలీ మెంబర్ల తో కలిసి విందు జరుపుకుంటామని పలువురు భారత ప్రవాసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం