నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- October 17, 2025
కువైట్: కువైట్ లోని జలీబ్ అల్ షుయోఖ్ లో నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఇది నిర్వహిస్తున్న ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మేధో సంపత్తి హక్కులు మరియు వాణిజ్య మోసాలకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కువైట్ మునిసిపాలిటీ సమన్వయంతో కంపెనీపై రైడ్స్ నిర్వహించారు. అక్రమ కర్మాగారాన్ని సీజ్ చేసిన అధికారులు 15వేల పెర్ఫ్యూమ్ ప్యాకేజింగ్ బాక్సులను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 28వేల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అన్ని రకాల వాణిజ్య మోసాలను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, అత్యవసర నంబర్ 112 కు కాల్ చేయడం ద్వారా ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం