దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- October 16, 2025
కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వినూత్న పథకాలు, సంస్కరణలు తీసుకురానున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్ల ఏర్పడిన డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ‘సూపర్ సిక్స్ పథకాలు’ మరియు కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు కలిపి ప్రజలకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చుతున్నాయని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘అసమాన నాయకుడు’గా అభివర్ణించిన చంద్రబాబు, ఆయన నాయకత్వం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని కొనియాడారు. “నేను చాలా ప్రధానులతో కలిసి పనిచేశాను, కానీ మోదీ వంటి కృషిశీల నాయకుడిని చూడలేదు” అని వ్యాఖ్యానించారు.మోదీ నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో నుంచి 4వ స్థానానికి చేరిందని గుర్తు చేశారు. దేశ భద్రతను ధృఢంగా నిలబెట్టిన మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ప్రపంచానికి భారత్ శక్తిని చూపించారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడుతూ, మెగా డీఎస్సీ, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం-2, పెన్షన్ల పెంపు వంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!