శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- October 16, 2025
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు.నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇటీవలి నెలల్లో బంగారం ధరలు లక్షా 30 వేల రూపాయల వరకు పెరగడంతో, అక్రమ రవాణా ఘటనలు మరింత పెరిగాయి. చోరీలు, చైన్స్నాచింగ్లతో పాటు అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో DRI అధికారులు విమానాశ్రయాల్లో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- స్టాటిన్ మందుల వినియోగం సేఫా? సౌదీ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక