ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- October 19, 2025
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు, టీడీపీ అనుచరులు ఆయనకు ఘన స్వాగతం అందించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎన్నారైలు జెండాలు ఊపుతూ, నినాదాలతో ఆత్మీయంగా లోకేశ్‌ను ఆహ్వానించారు.
ఆస్ట్రేలియా టీడీపీ అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు సిడ్నీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు లోకేశ్‌తో ఫోటోలు దిగారు. నగరమంతా స్వాగత ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చిన నారా లోకేశ్‌ను స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలను సందర్శించి, అధునాతన బోధనా విధానాలు, సాంకేతికతలపై అవగాహన పొందనున్నారు.
అదే విధంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వద్ద తెలుగు డయాస్పోరాతో నారా లోకేశ్ భేటీ అవనున్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష