'ఆర్యన్' థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్
- October 19, 2025
విష్ణు విశాల్ మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఫస్ట్ సింగిల్‌కి మంచి స్పందన వచ్చిన తర్వాత, ఇప్పుడు మేకర్స్ నెయిల్-బైటింగ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఒకప్పుడు కొడైకెనాల్ సీరియల్ కిల్లింగ్ కేస్‌ని సాల్వ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, ఇప్పుడు టెర్రిఫిక్ సైకోపాత్‌ని పట్టుకునే మిషన్‌లోకి వస్తాడు. కిల్లర్ ప్రతి హత్యకు గంట ముందు పోలీసులను ఛాలెంజ్ చేస్తూ మర్డర్ చేసే వారి పేరు చెబుతుంటాడు. దీంతో నగరమంతా భయంతో వణుకుతుంది. ఈ క్రమంలో, ఆఫీసర్ తన అనుభవం, తెలివి, ఇన్స్టింక్ట్లతో హంతకుడి ఆటను ఛేదించే ప్రయత్నం చేస్తాడు. కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు? అనేదే కథలో మెయిన్ ఎక్సయిటింగ్ ఎలిమెంట్.
దర్శకుడు ప్రవీణ్ కె ఒక యూనిక్ కథను ఎంచుకుని, ఆఫీసర్–కిల్లర్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు
విష్ణు విశాల్ తన పాత్రలో చాలా కమాండింగ్‌గా కనిపించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సెల్వరాఘవన్ చివర్లో ఎంట్రీ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతని ప్రెజెన్స్ ఇంపాక్ట్ కలిగిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్స్‌గా కనిపించారు
హరీష్ కన్నన్ కెమెరా వర్క్ సినిమాకి థ్రిల్లింగ్ టోన్ ఇచ్చింది, గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలో టెన్షన్‌ని పీక్స్‌కి తీసుకెళ్లింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై క్లాస్‌లో ఉన్నాయి.
సాయి రోణక్, తరక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్‌ప్లే కి‘ఎఫ్ఐఆర్’ దర్శకుడు మను ఆనంద్ సహరచన చేశారు. ఎడిటర్ సాన్ లోకేశ్.
‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్) గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
తారాగణం - విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి
నిర్మాణం - విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)
దర్శకత్వం - ప్రవీణ్ కె
నిర్మాతలు - శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్
తెలుగు రిలీజ్: సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్)
DOP - హరీష్ కన్నన్.
సంగీతం - జిబ్రాన్.
ఎడిటర్ - శాన్ లోకేష్.
స్టంట్స్ - స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు.
ఎడిషల్ స్క్రీన్ ప్లే - మను ఆనంద్.
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్.జయచంద్రన్.
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ - వినోద్ సుందర్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!