ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్ - తుర్కియే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవహారాలు, వాణిజ్యం మరియు సంస్కృతితో సహా పలు రంగాల్లో పురోగతి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తుర్కియే ను సందర్శించారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.
తాజాగా టర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక మరియు రక్షణ, సైన్స్ మరియు టెక్నాలజీ, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు మరియు టర్కియే మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం $1 బిలియన్లకు చేరుకుంటుందన్నారు. ఒమన్లో $6 బిలియన్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను టర్కిష్ కంపెనీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!