చిరంజీవి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు
- October 21, 2025
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.
ఈ ముగ్గురు ఐకానిక్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. కాలం మారినా, తరాలు మారినా, వీరి స్నేహం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే భావనను ఈ వేడుక మరోసారి గుర్తుచేసింది.
చిరంజీవి నివాసం పండుగ శోభతో మెరిసిపోయింది. మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు.
“నా డియర్ ఫ్రెండ్స్ @iamnagarjuna, @VenkyMama, నా సహనటి #Nayantharaతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను 🤗✨
ఇలాంటి క్షణాలే మన హృదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత..ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు 💐💐💐” అని చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్ పోస్ట్ చేశారు.
చిరంజీవి పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు ఐకానిక్ స్టార్స్ కలిసి కనిపించడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!