సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- October 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలో డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ విడుదల అయ్యాయి. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్ మెంట్ నిబంధనలను ఉల్లంఘించే ఎంప్లాయర్ కు గరష్ఠంగా SR20,000 ఫైన్ తోపాటు మూడు సంవత్సరాల పాటు కార్మికుల నియామకంపై నిషేధం విధిస్తారు.
అలాగే, వర్కర్ కు మంచి పని వాతావరణాన్ని కల్పించాలి. నియామకం, వృత్తుల మార్పు, సేవల బదిలీ, నివాస అనుమతి (ఇఖామా) మరియు పని అనుమతులకు సంబంధించిన ఎటువంటి రుసుములను వసూలు చేయవద్దని నిర్దేశించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలను చెల్లించాలి. 8 వర్క్ అవర్స్, వీక్లీ ఆఫ్ తోపాటు రెండు సంవత్సరాల పని తర్వాత పూర్తి నెల రోజులపాటు సెలవు కల్పించాలి. నిబంధనలకు అనుగుణంగా సెలవులను అనుమతించాలని పేర్కొన్నారు.
డొమెస్టిక్ వర్కర్ సెక్టర్ ను నియంత్రించడం అనేది అన్ని పార్టీల హక్కులను రక్షించడానికి మరియు న్యాయం, గౌరవం ఆధారంగా పని వాతావరణాన్ని నిర్ధారించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధత తో పనిచేస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో సౌదీ అరేబియా చట్టాలు , నిబంధనలకు అనుగుణంగా ఎంప్లాయర్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం డొమెస్టిక్ వర్కర్స్ పనిచేయాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్