5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- October 23, 2025
ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను సొంతం చేసేసుకుంది. ఏఐను అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు చాలా మంది ఉద్యోగాలను నుంచి తీసేస్తున్నారు. దానికి తోడు ఖర్చులను తగ్గించుకోవడానికి, వీసాల బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా లేఆఫ్‌లను చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. ఇప్పుడు మరో 5 లక్షల మందికి ఎసరు పెట్టడానికి రెడీ అయింది. ఆటోమేషన్, ఏఐలను దాటుకుని ఏకంగా రోబోలతో పని చేయించుకోవడానికి సిద్ధమైంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
అమెజాన్ ఆటోమేషన్ బృందం దీనిపై పని చేస్తోంది. నెమ్మదిగా మనుషుల స్థానంలో రోబోలను పనిలోకి తీసుకువస్తోంది. త్వరలోనే 5 లక్షల ఉద్యోగాలను అమెజాన్ రోబోలతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచుతుందని కూడా చెబుతున్నారు. 2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాలను తప్పించడం లేదా..నియమించకుండా ఉండేందుకు అమెజాన్ ఆటోమేషన్ బృందం పని చేస్తోంది. దీని వలన అమెజాన్ ఎంచుకునే, ప్యాకింగ్, డెలివరీ చేసే ప్రతి వస్తువుపై కంపెనీకి దాదాపు 30 సెంట్లు లేదా రూ. 26 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2033 నాటికి దాదాపు 6లక్షల రోబోలు అమెజాన్‌లో పని చేస్తాయని చెబుతున్నారు. 2012లో అమెజాన్ రోబోటిక్స్ తయారీ సంస్థ కివాను $775 మిలియన్లకు కొనుగోలు చేయడంతో రోబోటిక్ ఆటోమేషన్‌లోకి తొలిసారిగా ప్రవేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







