నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

- October 23, 2025 , by Maagulf
నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఫేక్ లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌ రావు లొంగిపోతాడని మీడియాలో ముందుగా ఎలా వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఇవాళ తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

“రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ మద్యం మాఫియా ఉంది. ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం తయారుచేస్తున్నారు. బెల్ట్, పర్మిట్ రూమ్స్ తో పాటు వైన్ షాపుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బుల కోసం నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. వాటాల్లో తేడాలు రావడంతో ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది” అని అన్నారు.

నిందితులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. ఆర్గనైజ్డ్‌గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు అలవాటేనని తెలిపారు. ఆఫ్రికాలో మూలలు ఉన్నాయంటూ టీడీపీ సామాజిక మాధ్యమాల్లో బిల్డప్పుల ఇస్తోందని అన్నారు.

నిందితుడితో మాజీ మంత్రి జోగి రమేశ్‌ పేరును కూడా చెప్పించారని జగన్ ఆరోపించారు. మొలకల చెరువులోనే ఏకంగా 20,000 లీటర్ల నకిలీ మద్యం బయటపడిందని అన్నారు. కల్తీ లిక్కర్‌ మాఫియాలో టీడీపీ వాళ్లే ఉన్నారని చెప్పారు.

అంతా చేయిస్తున్నది చంద్రబాబేనని అన్నారు. టాపిక్‌ను డైవర్ట్‌ చేయడానికి నిందను వేరే వారికి మీద వేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు విజయవాడ సీపీ వింటున్నారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com