ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ

- October 23, 2025 , by Maagulf
ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్(BRS) పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపధ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్వయంగా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్(BRS) నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి ప్రచారం, ఇంటింటి కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కేసీఆర్ పార్టీ శ్రేణులను సమగ్రంగా సమన్వయం చేసుకుని, విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరే నాయకుల అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com