ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- October 23, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాబోయే రోజుల్లో సరికొత్త రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రెండు హైస్పీడ్ రైల్ కారిడార్(AP) ప్రాజెక్టులు రాష్ట్రం మీదుగా సాగనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు మరియు జిల్లాల మధ్య రవాణా సమయం గణనీయంగా తగ్గనుంది
హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా సుమారు 263 కిలోమీటర్ల మేరగా విస్తరించనుంది. ఈ మార్గంలో అనేక కీలక స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుండి చెన్నై వరకు ప్రయాణ సమయం సగానికి తగ్గే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల(AP) మీదుగా 504 కిలోమీటర్ల పొడవున విస్తరించనుంది. ఈ కారిడార్లో 15 స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. రాయలసీమ ప్రజలకు హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. హైస్పీడ్ రైళ్ల ప్రవేశంతో రాష్ట్రంలోని పర్యాటక, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడనుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







