చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- October 26, 2025
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) నూతనంగా ఎన్నికైన సభ్యులు నిన్న మెగాస్టార్ చిరంజీవిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చిరంజీవికి వివరించారు.
TFJA సభ్యులు మాట్లాడుతూ, సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.సినిమా రంగంలో కష్టపడే జర్నలిస్టుల కోసం TFJA చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చిరంజీవి అభినందించారు.
అసోసియేషన్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన ఆయన, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు తనవంతు సహాయం ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసిన వారిలో TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, అలాగే ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సినిమా రంగంలో జర్నలిస్టుల శ్రేయస్సు కోసం TFJA చేస్తున్న కృషిని మెగాస్టార్ ప్రశంసించడంతో, అసోసియేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టీఎఫ్జేఏ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







