అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!

- October 27, 2025 , by Maagulf
అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!

దోహా: అల్ వక్రా పోర్టులో లంగరు వేసిన అనేక ఫిషింగ్ బోట్లను దహనం చేసిన అగ్నిప్రమాదం కేసులో పురోగతి నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆసియా సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. ఇద్దరు నిందితులు ఒక పడవ నుండి మరొక పడవకు చట్టవిరుద్ధంగా విద్యుత్ లైన్‌ను కనెక్ట్ చేయడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక, పోరెన్సిక్ విచారణలో తేలిందని వెల్లడించారు. అక్టోబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను వేగంగా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com