కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- October 27, 2025
కువైట్ః కువైట్ లో 4వేల ఏళ్ల కిందటి పాత దిల్మున్ నాగరికత ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఫైలాకా ద్వీపంలోని దిల్మున్ నాగరికత కు చెందిన 4,000 సంవత్సరాల పురాతన కాంస్య యుగం నాటి ఆలయాన్ని కనుగొన్నట్లు జాతీయ కల్చరల్ మరియు ఆర్ట్స్ మండలి (NCCAL) ప్రకటించింది. కువైట్-డానిష్ పురావస్తు బృందం 2025 లో చేపట్టిన తవ్వకాల సీజన్‌లో దీనిని ఆవిష్కరించిందని మండలిలో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బిన్ రెధా తెలిపారు.
త్రవ్వకాలలో ఒకే స్థలంలో రెండు సూపర్‌పోజ్డ్ దేవాలయాలు ఉన్నాయని నిర్ధారించారని, రెండూ దాదాపు 4,000 సంవత్సరాల నాటివని ఆయన వివరించారు.ఈ ప్రాంతం కాంస్య యుగం యొక్క ప్రారంభ దిల్మున్ కాలం నాటి టెల్ F6 లోని "ప్యాలెస్" మరియు "దిల్మున్ టెంపుల్" ప్రాంతాలకు తూర్పున ఉందన్నారు. కొత్తగా బయటపడిన ఆలయం, ఫైలకా ద్వీపం పురాతన దిల్మున్ నాగరికతకు కీలకమైన కేంద్రంగా ఉండేదని, దాదాపు నాలుగు ఏళ్ల క్రితం గల్ఫ్ ప్రాంతం అంతటా వాణిజ్యం, పాలనకు వారధిగా ఉండేదని ఆధారాలను బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







