స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- October 28, 2025
కర్నూలులో(Kurnool) జరిగిన బస్సు ప్రమాదం విషాదాన్ని మరువకముందే, మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) పిలిభిత్ నుండి జైపూర్‌కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు 11,000 వోల్ట్ల విద్యుత్ హైటెన్షన్ వైర్లను తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదం ఉదవాలా సమీపంలో జరిగింది. బస్సులోపల ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై, వెంటనే కిందికి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బాధితులు షాపురాలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







