'డకాయిట్' ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్
- October 28, 2025
అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'డకాయిట్' లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్ రిలీజ్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
మేకర్స్ తాజాగా డకాయిట్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. 2026 ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.
ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో ఆకట్టుకుంది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం డకాయిట్ కావడం విశేషం.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







