తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..

- October 28, 2025 , by Maagulf
తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..

తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్.. 

అంతర్వేదిపాలెంలో మొంథా తీవ్ర తుపాన్ తీరాన్ని తాకింది. అలాగే, కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది. తుపాను ఎఫెక్ట్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉంది.

జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మూసివేశారు. తీరం దాటే వేళ గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మధ్య వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్‌ ఉంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.

పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత ప్రజలను తరలించారు. APSDMA స్టేట్ కంట్రోల్ రూమ్: 112, 1070, 1800 425 0101కు సాయం కోసం ఫోన్ చేయొచ్చు. ‘మొంథా’ తుపాన్‌ ప్రభావంతో కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.  ఏపీలోని తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు, కృష్ణా జిల్లా బందరు బీచ్ రోడ్‌లో ఈదురుగాలులు, భారీ వర్షాలతో పలు వృక్షాలు నేలకొరిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బందర్ నుంచి మంగినపూడి బీచ్‌కి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.

ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలపై ప్రైవేటు, వాణిజ్య వాహనాలపై నిషేధం విధించామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు, మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాల ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని అత్యవసర చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల రాకపోకలను ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి నిలిపివేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com