భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

- October 29, 2025 , by Maagulf
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (BEL) లో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఘజియాబాద్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్–C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషంలో సైట్ ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడకుండా వెంటనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నియామకాల ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నట్లు (BEL) ప్రకటించింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి. టెక్నీషియన్–C పోస్టులకు ITI (Industrial Training Institute) సర్టిఫికేట్, అలాగే సంబంధిత ట్రేడ్‌లో అనుభవం అవసరం.

అదనంగా ఇంటర్‌ అర్హతగల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపి సమర్పించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com