బ్రెజిల్‌లో భారీ ఆపరేషన్–60 మంది గ్యాంగ్ సభ్యుల హతం
- October 29, 2025
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లపై భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 2,500 మంది పోలీసులు, సైనిక జవాన్లు పాల్గొన్నారు. దాదాపు 60 మంది అనుమానితులను కాల్చివేయగా, 81 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున 93 రైఫిల్స్, 500 కిలోల డ్రగ్స్, వాహనాలు, గ్యాంగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మర్‌డ్ వాహనాలు కూడా వినియోగించారు.
ఈ ఘటన పై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ తీవ్రంగా స్పందించింది. పోలీస్ చర్యల్లో అధిక హింస చోటుచేసుకుందని పేర్కొంటూ, స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. బ్రెజిల్‌లో ఇటీవలి కాలంలో డ్రగ్ మాఫియాల దాడులు, గ్యాంగ్ యుద్ధాలు పెరగడంతో ప్రభుత్వం ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. రియో ప్రాంతం డ్రగ్ అక్రమ రవాణాకు కేంద్రంగా మారడంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







