నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- October 30, 2025
ముంబై: అక్టోబర్ నెల ముగియడానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభం కానుంది. అందువల్ల మీరు నవంబర్‌లో ఏవైనా బ్యాంకు కు సంబంధించిన పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు ఏ ఏ రోజుల్లో పని దినాలను కలిగి ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నెల (అక్టోబర్)లో ఎక్కువ సెలవులు వచ్చాయి
అక్టోబర్ కంటే నవంబర్‌లో తక్కువ సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజులు మూతపడే అవకాశం ఉంది. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవు దినాలలో డిజిటల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి.
- నవంబర్ 1 (శనివారం):కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా బెంగళూరులో, ఇగాస్-బాగ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- నవంబర్ 2 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
- నవంబర్ 5 (బుధవారం):గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
- నవంబర్ 7 (శుక్రవారం): వంగలా పండుగ కోసం షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- నవంబర్ 8 (శనివారం): రెండవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు. కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.
- నవంబర్ 9, 16, 23, 30 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
- నవంబర్ 22 (శనివారం): నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







