ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- November 03, 2025
యూఏఈ: యూఏఈలో వ్యాప్తంగా యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అబుదాబిలోని ఖాసర్ అల్ హోస్న్లో యూఏఈ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూఏఈ డిఫెన్స్ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. జెండా దినోత్సవం అనేది మనల్ని ఏకం చేసి ఉమ్మడి బాధ్యతను గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అన్నారు. అందరూ కలిసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మెలగాలని పిలుపునిచ్చారు.
షేక్ జాయెద్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజును సూచిస్తూ యూఏఈ జాతీయ దినోత్సవం (ఇప్పుడు ఈద్ అల్ ఎతిహాద్ అని పిలుస్తారు) డిసెంబర్ 2, 1971న జరుపుకుంటారు. అయితే యూఏఈ జెండా దినోత్సవాన్ని దేశ రెండవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పట్టాభిషేకం జరిగిన నవంబర్ 3న జరుపుకుంటారు.
నవంబర్ 3 నుండి డిసెంబర్ 2 వరకు నెల రోజులను నేషనల్ మంత్ గా జరుపుకుంటారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 11, 2012న జెండా దినోత్సవాన్ని ప్రకటించారు. దీనిని మొదటిసారిగా 2013లో జరుపుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







