DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!

- November 04, 2025 , by Maagulf
DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!

కువైట్: DP వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20) తో కువైట్ క్రికెట్ బోర్డు (KCC) చేతులు కలిపింది. ఇది ప్రపంచ క్రికెట్ వేదికపై కువైట్ ఉనికిని పెంచుతుందని భావిస్తున్నారు.  ఈ చారిత్రాత్మక వేడుకను జరుపుకోవడానికి నవంబర్ 10న ప్రత్యేకంగా గాలా వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందులో క్రికెట్ ప్రముఖులు, విశిష్ట అతిథులు, స్పాన్సర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారుడు అలీ జాఫర్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. క్రికెట్ దిగ్గజాలు హర్భజన్ సింగ్ మరియు వకార్ యూనిస్ ప్రత్యేక ప్యానెల్ చర్చలో పాల్గొంటారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అధికారిక ఎమ్సీగా వ్యవహరిస్తారు.  

KCC మరియు DP వరల్డ్ ILT20 మధ్య భాగస్వామ్యం క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ క్రికెట్‌లో కువైట్ స్థానాన్ని పెంచడానికి దోహద పడుతుందని కువైట్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొట్టమొదటి DP వరల్డ్ ILT20 ప్లేయర్ వేలంలో ఆరుగురు కువైట్ ఆటగాళ్లు సెలెక్ట్ అయ్యారని, వారు అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, డెజర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్, MI ఎమిరేట్స్ మరియు షార్జా వారియర్స్ లలో స్థానాలను పొందారని వెల్లడించింది. ఈ ఆటగాళ్ళు డిసెంబర్ 2న యూఏఈలో ప్రారంభం కానున్న ILT20 సీజన్ 4లో కువైట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com