‘శివ’ 4K ట్రైలర్.. సరికొత్త హంగులతో టాలీవుడ్ గేమ్ ఛేంజర్!
- November 04, 2025
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.
అద్భతమైన 4K విజువల్స్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో ట్రైలర్ అదిరిపోయింది. ప్రతి సీన్‌లో టెన్షన్, ఎమోషన్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ట్రైలర్ చివర్లో నాగర్జున సైకిల్ చైన్ లాగిన సీన్ గూస్బంప్స్ క్రియేట్ చేసింది. శివ మ్యాజిక్ ని 4K డాల్బీ ఆట్మాస్ లో థియేటర్స్ లో చూడాలనే ఎక్సయిట్మెంట్ ట్రైలర్ మరింతగా పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ...ఎంతో ప్రేమతో వచ్చిన మీ అందరికీ థాంక్యూ.ఈ సినిమాని మీ నాన్న, అమ్మ థియేటర్స్ లో చూసుంటారు. వాళ్ళందరికీ థాంక్యూ. ఇప్పుడు అదే ప్రేమతో మీరు వచ్చారు. మీకు థాంక్యూ. అందరికంటే నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ కి థాంక్యూ. 36 ఏళ్ల క్రితం నాతో శివ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్ ని చేశారు. పొద్దున్నే సినిమా చూశాను. స్టన్నింగ్ గా అనిపించింది. రాము దాదాపు 6 నెలలు చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా, ఒక మైల్ స్టోన్ గా నిలబెట్టాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. సినిమా చాలా అవుట్ స్టాండింగ్ గా వచ్చింది. ఇప్పటికి కూడా అంతే స్టన్నింగ్ గా అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సౌండ్ డిజైన్ తో నేను చేస్తున్న సినిమాలు రావడం లేదనిపించింది. శివ డాల్బీ ఆట్మాస్ లో రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. శివ ఈజ్ ఫరెవర్. మరో 36 ఏళ్ల తర్వాత ఇదే స్టేజి మీద, సినిమాని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 14న మీరందరూ కూడా శివని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. రాజమౌళికి గారు అన్నట్టు ఆఫ్టర్ శివ బిఫోర్ శివ. శివ ఎప్పటికీ నిలిచిపోతుంది.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..అందరికీ హాయ్. 36 ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమా.. 36 ఏళ్ల తర్వాత మా ఇద్దరం కూడా ఒకే స్టేజ్ పై ఇలా మీ ముందు రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లడతామని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఇది వెరీ గ్రేట్ ఫీలింగ్. ఆరోజు నాగర్జున నాకు విజువల్ గా సౌండ్ పరంగా చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ రోజు కూడా అంతే ఫ్రీడమ్ ఇచ్చారు. రీ రిలీజ్ కోసం సౌండ్ ని చాలా బెటర్ గా డిజైన్ చేశాం. కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతవరకు శివ చిరంజీవిలా చిరస్మరణీయం.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







