బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!

- November 05, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!

మనామా: బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ కు అంతా సిద్ధమైంది. డిసెంబర్‌లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ లోని కీలక ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 200 మరియు 300 మధ్య యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ నేరాలను రికార్డ్ చేయగల గుర్తింపు వ్యవస్థలను కలిగి ఉంటాయని, ఇవి రోడ్లపై భద్రతను పెంచుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖలోని శాసనసభ అధికార వ్యవహారాల అండర్ సెక్రటరీ రషీద్ బునజ్మా వివరించారు. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంటులో ప్రణాళికను ప్రవేశపెట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com