3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!

- November 05, 2025 , by Maagulf
3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!

యూఏఈ: మూడు రోజుల క్రితం దుబాయ్ నుండి లక్నోకు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తమ లగేజీ కోసం వెయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌లో ఎయిర్ లైన్ సిబ్బంది వదిలేసి వచ్చిన లగేజీ కోసం ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నవంబర్ 3న దుబాయ్ నుండి ఒక బంధువు వివాహానికి హాజరు కావడానికి విమానంలో వచ్చిన ఎస్కె కూడా ఉన్నారు. తాను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాక్‌సూట్ మాత్రమే ధరించి దిగానని ఆయన చెప్పారు. "నా షేర్వానీ, బూట్లు మరియు బహుమతులు నా చెక్డ్ బ్యాగ్‌లో ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.  "నేను మూడు రోజులుగా ప్రతిరోజూ విమానాశ్రయానికి వస్తున్నాను, వారు - 'రేపు మాపు అంటూ తిప్పి పంపుతున్నారు' అని చెబుతూనే ఉన్నారు. ఇలాంటి వివాహానికి నేను ఎలా హాజరు కావాలి?" అంటూ మండిపడ్డాడు.

దుబాయ్ నుండి వచ్చిన విమానం IX-198 నవంబర్ 3న తెల్లవారుజామున 4.30 గంటలకు లక్నోలో దిగింది. కానీ వారి వస్తువులకు బదులుగా, అంతుకుముందు ప్లైట్ IX-194 లగేజీని తీసుకొచ్చారు.  దుబాయ్‌లో వారి లగేజీ "లోడ్ తప్పిపోయింది" మరియు 12 గంటల్లోపు చేరుకుంటుందని ఎయిర్‌లైన్ సిబ్బంది వారికి చెప్పినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు.  కానీ, నేటికి లగేజీ అందలేదని ప్రయాణికులు మండిపడ్డారు.  కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేస్తే ఎవరూ స్పందించడం లేదని, 50 కాల్స్ తర్వాత కూడా ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు.   అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, విమానయాన అధికారులను ట్యాగ్ చేశారు. అయితే, ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ స్పందించ లేదు.  దాదాపు 200 మంది ప్రయాణికులు ప్రభావితమైనట్లు లక్నో విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com