సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!

- November 05, 2025 , by Maagulf
సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!

రియాద్: సౌదీ పౌరులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. చైనా ప్రభుత్వం సౌదీ పౌరులకు డిసెంబర్ 31, 2026 వరకు వీసా మినహాయింపును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. అదే సమయంలో పర్యాటక, సాంస్కృతిక మరియు ఆర్థిక మార్పిడిని బలోపేతం చేస్తుందని పేర్కొంది.

ఈ మినహాయింపు సౌదీ పౌరులు కొన్ని షరతులకు లోబడి ముందస్తుగా వీసా అవసరం లేకుండా చైనాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఇది రెండు దేశాల ప్రజల మధ్య సహకారాన్ని పెంచుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com