‘పెద్ది’ నుంచి కొత్త అప్డేట్..
- November 05, 2025
టాలీవుడ్ మాస్ హీరో రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, విడుదలకు ముందే ఒక్కో అప్డేట్తో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా టీమ్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.
ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏఆర్ రెహమాన్ తో కలిసి ఈ ‘చికిరి’ పదానికి అసలు అర్థం ఎంటో చెప్పాడు బుచ్చిబాబు. ఈ సందర్భంగా ప్రోమోను పంచుకున్నారు. ఈ పాట ఫుల్ లిరికల్ నవంబర్ 07న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా బుచ్చిబాబు తన చిన్ననాటి జ్ఞాపకాలను రెహమాన్‌తో పంచుకున్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన కజిన్ బాబీ ఇచ్చిన ‘బొంబాయి’ సినిమా పాటల క్యాసెట్ విన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని అయ్యానని తెలిపారు. ‘పెద్ది’ కథ ఫైనల్ అయ్యాక సంగీత దర్శకుడిగా మరో ఆలోచన లేకుండా రెహమాన్నే ఎంచుకున్నట్లు బుచ్చిబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించిన ‘చికిరి చికిరి’ పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఇక ‘పెద్ది’ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







