కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!

- November 06, 2025 , by Maagulf
కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!

కువైట్ : కువైట్ లోని 146 వాణిజ్య సంస్థలకు ఫైర్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన నేపత్యంలో జలీబ్ అల్-షుయ్యుఖ్‌లోని 146 వాణిజ్య సంస్థలను మూసివేస్తామని కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రకటించింది.

మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఫైర్ ఫోర్స్ యాక్టింగ్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-కహ్తానీ తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక మరియు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వాణిజ్య సంస్థలను గుర్తించి, హెచ్చరిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించిన కొన్నింటిని వెంటనే మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  చట్టపరమైన చర్యలు మరియు షట్‌డౌన్‌లను నివారించడానికి భద్రతా నిబంధనలను పాటించాలని వ్యాపార యజమానులకు ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com