గ్లోబల్ స్థాయిలో ‘రాజాసాబ్’ ప్రమోషన్స్!
- November 06, 2025
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అద్భుతమైన వార్త అందింది. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడానికి దర్శకుడు మారుతి ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ లో వాణిజ్య అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉండబోతున్నాయని సమాచారం.
త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్, ప్రతి 10 రోజులకు కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నాయి. అలాగే క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







