RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం

- November 07, 2025 , by Maagulf
RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం

హైదరాబాద్‌: ఆర్బీవీవీఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ భద్రత, గౌరవం, వృత్తి నైపుణ్యం అనే ప్రధాన విలువలను ప్రతి అధికారి తమ సేవలో పాటించాలని సూచించారు. యూనిఫాం ధరించడం గౌరవానికి సంకేతమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేసేది అని అన్నారు.

పోలీసు అధికారిగా న్యాయపరమైన దృక్పథం, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com