జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్‌ ప్రారంభం..!!

- November 07, 2025 , by Maagulf
జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్‌ ప్రారంభం..!!

మనామాః  గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో బహ్రెయిన్, ఖతార్ తొలి అంతర్జాతీయ ప్రయాణీకుల సముద్ర మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు. బహ్రెయిన్‌లోని ముహర్రక్‌లోని సాదా పోర్టు నుండి ఖతార్‌లోని అల్ రువైస్ పోర్టుకు ప్రారంభ యాత్ర కొనసాగింది. ఇది గల్ఫ్ సముద్ర అనుసంధానం మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన ముందడుగుగా భావిస్తున్నారు.
బహ్రెయిన్-ఖతార్ ప్రయాణీకుల ఫెర్రీ సర్వీస్ ను బహ్రెయిన్ రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. రవాణా నెట్‌వర్క్‌లను విస్తరించడం, ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని పెంపొందించడంలో బహ్రెయిన్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు.  
బహ్రెయిన్ సముద్ర పర్యాటక రంగంలో ఇది కీలక ప్రాజెక్టుగా పేర్కొన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందజేస్తుందన్నారు.  సముద్ర రవాణా రంగంలో బహ్రెయిన్ ప్రాంతీయ స్థానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ ఉమ్మడి ప్రాజెక్టును సాకారం చేయడంలో సహకారం అందించిన వారిపై డాక్టర్ షేక్ అబ్దుల్లా షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ ప్రశంసలు కురిపించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com