కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- November 07, 2025
కువైట్ః కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన రెండు రోజుల అధికారిక కువైట్ పర్యటన ప్రారంభమైంది. బయాన్ ప్యాలెస్‌లో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేరళ మరియు కువైట్ మధ్య కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. ఇండియా, కువైట్ మధ్య దీర్ఘకాలిక మరియు స్నేహపూర్వక సంబంధాలను సమీక్షించారు.
కువైట్ అభివృద్ధికి ఇండియాన్ కమ్యూనిటీ- ముఖ్యంగా మలయాళీల అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళీయుల పట్ల కువైట్ చూపుతున్న ప్రేమకు ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళను పెట్టుబడికి అనుకూలమైన గమ్యస్థానంగా హైలెట్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయతిలక్, లులు గ్రూప్ చైర్మన్ M.A. యూసుఫ్ అలీ మరియు భారత రాయబార కార్యాలయం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







