సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!

- November 11, 2025 , by Maagulf
సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!

రియాద్: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ అలీ అల్-యాహ్యాను కలిశారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య సోదర మరియు చారిత్రక సంబంధాలను సమీక్షించారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలను కూడా వారు చర్చించారు.

సమావేశం తరువాత మంత్రులు సౌదీ-కువైట్ సమన్వయ మండలి మూడవ సమావేశంలో పాల్గొన్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కౌన్సిల్ సమావేశం ముగింపులో నాలుగు అవగాహన ఒప్పందాలపై (MoUలు) సంతకాలు చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com