రైలు ప్రయాణికులకు శుభవార్త..!!

- July 24, 2016 , by Maagulf
రైలు ప్రయాణికులకు శుభవార్త..!!

రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు త్వరలోనే రైళ్లలో రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట 1000 రైళ్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రేడియోలో ప్రయాణికులకు పాటలతో పాటు రైలుకు సంబంధించిన సమాచారం అందించనుంది. రైల్వే చరిత్ర, ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సౌకర్యాలను, ఏదైనా అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రముఖ రేడియో సంస్థలతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు 2016-17 బడ్జెట్‌లో ప్రజలకు వినోదం అందించేందుకు రైలు రేడియోల ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సౌకర్యం శతాబ్ది, రాజధాని రైళ్లలో మాత్రమే ఉంది. మిగతా రైళ్లలో కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ రైలు రేడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం సులభతరమౌతుంది. దీంతో పాటు ప్రస్తుతం ప్రముఖ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్న రైలుబంధు అనే ద్విభాషా మ్యాగజైన్‌ను కూడా అన్ని రైళ్లలోకి, అన్ని భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com