ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- November 13, 2025
మస్కట్: లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, స్మార్ట్ బ్యాగులు మరియు ఇ-సిగరెట్లు తీసుకెళ్లే ప్రయాణీకుల కోసం ఒమన్ ఎయిర్ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇకపై పవర్ బ్యాంకులను హ్యాండ్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి. వాటిని ఫ్లైట్ లో ఉపయోగించకూడదు లేదా ఛార్జ్ చేయకూడదు. దెబ్బతిన్న లేదా లేబుల్ చేయని పవర్ బ్యాంకులపై నిషేధం విధించారు.
ఇ-సిగరెట్లు మరియు వేప్‌లను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. వాటిని కూడా ఫ్లైట్ ఉపయోగించేందుకు అనుమతించరు. అయితే, ప్రయాణీకులు విమానంలోని ఛార్జింగ్ పోర్టులను ఉపయోగించి ఫోన్లు మరియు టాబ్లెట్లు వంటి వారి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను (PEDలు) ఛార్జ్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణంలో బ్యాటరీలు, పవర్ బ్యాంకులు మరియు ఇ-సిగరెట్లను ఛార్జ్ చేయకూడదు.
లిథియం బ్యాటరీతో నడిచే వ్యక్తిగత రవాణా పరికరాలు అయిన హోవర్బోర్డులు, బ్యాలెన్స్ వీల్స్, మినీ-స్కూటర్లు వంటి వస్తువులను చెక్డ్ లేదా క్యారీ-ఆన్ లగేజీగా విమానంలో అనుమతించరని ఎయిర్‌లైన్ తెలియజేసింది. ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది భాగమని ఒమన్ ఎయిర్ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







