జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!

- November 13, 2025 , by Maagulf
జిసిసి \'వన్-స్టాప్\' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!

యూఏఈ: జీసీసి స్థాయిలో 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభమైంది. ఇది సభ్య దేశాల మధ్య సులువుగా ప్రయాణించేలా చూస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రయోగాత్మకంగా యూఏఈ, బహ్రెయిన్ మధ్య ప్రారంభించనున్నారు.  

కొత్త వ్యవస్థ గల్ఫ్ పౌరులు ఒకే చెక్‌పాయింట్‌లో అన్ని ప్రయాణ విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుందని జిసిసి సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి తెలిపారు. కువైట్ నగరంలో జరిగిన జిసిసి అంతర్గత మంత్రుల 42వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ లో యూఏఈ, బహ్రెయిన్ మధ్య విమాన ప్రయాణం ద్వారా పైలట్ దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు.  పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ వ్యవస్థను ఆరు GCC సభ్య దేశాలకు విస్తరిస్తామని అల్బుదైవి చెప్పారు.

మరోవైపు యూనిఫైడ్ GCC పర్యాటక వీసాను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. స్కెంజెన్-తరహా వీసా జారీ పైలట్ దశ ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని యూఏఈ  ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. అధికారికంగా GCC గ్రాండ్ టూరిస్ట్ వీసా అని పిలువబడే వీసా ఒకే పర్యాటక గమ్యస్థానంగా గల్ఫ్ ఆకర్షణను పెంచుతుందని అల్ మర్రి అన్నారు. గల్ఫ్-వైడ్ వీసా 2026 నాటికి లేదా 2027 నాటికి పూర్తిగా అమలులోకి రావచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com