దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- November 13, 2025
దుబాయ్: ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్ దమాక్ ప్రాపర్టీస్ తన కొత్త మాస్టర్ కమ్యూనిటీ “దమాక్ ఐలాండ్స్ 2”ను ప్రారంభించింది.ఇది దుబాయ్ లో సంస్థ రూపొందించిన ఏడవ మాస్టర్ కమ్యూనిటీగా నిలిచింది. నీటితో చుట్టుముట్టిన జీవనశైలికి కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఈ ప్రాజెక్ట్ దుబాయ్ నగరానికి ఒక ట్రాపికల్ స్వర్గధామం వలె రూపుదిద్దుకుంది.
“దమాక్ ఐలాండ్స్” మొదటి దశ విజయాన్ని కొనసాగిస్తూ, “దమాక్ ఐలాండ్స్ 2”లో అంటిగువా, బహామాస్, బార్బడోస్, బెర్ముడా, క్యూబా, మావీ, మారిషస్, తహీటి వంటి ఎనిమిది అందమైన దీవుల ప్రేరణతో రూపొందించిన డిజైన్‌లు, పచ్చని ల్యాండ్‌స్కేప్‌లు, క్రిస్టల్ లాగూన్‌లు, వెల్‌నెస్ ఆధారిత ఆర్కిటెక్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

దమాక్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ అమీరా సజ్వాని మాట్లాడుతూ, “దమాక్ ఐలాండ్స్ 2 దుబాయ్ యొక్క ఆత్మవిశ్వాసం మరియు ట్రాపికల్ ఎనర్జీని కలగలిపే ప్రాజెక్ట్. ఇది కేవలం నివాసం కాదు, నగర హృదయంలో స్వర్గాన్ని అనుభవించే ఆహ్వానం. ప్రకృతి సౌందర్యాన్ని, దమాక్ ప్రమాణాలను కలిపిన మాస్టర్‌పీస్ ఇది” అని అన్నారు.
ప్రారంభ వేడుక దమాక్ గ్రూప్ చైర్మన్ హుస్సేన్ సజ్వాని మరియు అమీరా సజ్వాని ఆధ్వర్యంలో కోకా-కోలా అరేనాలో జరిగింది.ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అరబ్ గాయకుడు మజీద్ అల్ మొహండిస్ తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.
ప్రాజెక్ట్‌లో వెల్‌నెస్ పావిలియన్లు, ఫ్లోటింగ్ డెక్స్, ఓపెన్ ఎయిర్ స్పాస్, ప్రకృతి స్ఫూర్తితో రూపొందించిన రిట్రీట్‌లు ఉండగా, నగరంలోని కోలాహలంలో ప్రశాంతతను అనుభవించే అవకాశం కల్పిస్తాయి.

దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి 290 రోజులకే AED 525.87 బిలియన్ విలువైన ఆస్తి లావాదేవీలు నమోదయ్యాయి. 2025 మూడవ త్రైమాసికంలోనే AED 170.7 బిలియన్ విలువైన 59,228 ట్రాన్సాక్షన్లు జరిగి చరిత్ర సృష్టించాయి.
2025 మొదటి అర్ధభాగంలో రెసిడెన్షియల్ ట్రాన్సాక్షన్లు AED 262.1 బిలియన్ దాటగా, ఇది గత సంవత్సరం కంటే 36.4% వృద్ధి. దమాక్ ఐలాండ్స్ ప్రాజెక్ట్ ఒక్కటే 4,185 విల్లా & టౌన్‌హౌస్ విక్రయాలు నమోదు చేసింది.
దమాక్ హిల్స్ 1, 2 మరియు దమాక్ ఐలాండ్స్ ప్రాజెక్టులు 72%, 60%, 29% వరకు ధరల వృద్ధిని నమోదు చేశాయి. ఇది పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది.
ప్రారంభోత్సవంలో భాగంగా దమాక్ ఒక ప్రత్యేక గ్లోబల్ పోటీని కూడా ప్రకటించింది — “ది అల్టిమేట్ ఐలాండర్”. విజేతకు ఎనిమిది దీవుల్లో ఒకదానిపై నివసిస్తూ, దమాక్ ఉద్యోగిగా పని చేసే అరుదైన అవకాశం కల్పించనున్నారు.
దమాక్ ఐలాండ్స్ 2లో
- 6 బెడ్‌రూమ్ లగ్జరీ విల్లాలు (583 చ.మీ.)
- 5 బెడ్‌రూమ్ ట్విన్ విల్లాలు (324 చ.మీ.)
- 5 బెడ్‌రూమ్ టౌన్‌హౌస్‌లు (293, 263 చ.మీ.)
- 4 బెడ్‌రూమ్ టౌన్‌హౌస్‌లు (203 చ.మీ.)
- ఉండగా, ధరలు AED 2.7 మిలియన్ నుండి ప్రారంభమవుతాయి.
ఈ కొత్త ప్రాజెక్ట్ దమాక్ యొక్క లైఫ్‌స్టైల్-డ్రైవన్ విజన్కు మరో మెట్టు వేస్తూ, దుబాయ్ ని ప్రపంచంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ గమ్యస్థానాల జాబితాలో మరింతగా ఎత్తుకు తీసుకెళ్తోంది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







