విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్

- November 13, 2025 , by Maagulf
విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్(Aadhaar) వివరాలను సులభంగా సరిచేసుకునేందుకు పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ కార్యక్రమం నవంబర్ 17 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆధార్ వివరాల్లో ఉన్న పొరపాట్లు సరిచేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని (వేలిముద్రలు, కంటి స్కాన్‌) నవీకరించడం వంటి సేవలు(UIDAI) అందుబాటులో ఉండనున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లకు అధికారిక సూచనలు పంపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలలోనే ఈ అప్‌డేట్ సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని అధికారుల విజ్ఞప్తి. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com