విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

- November 13, 2025 , by Maagulf
విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. నగర అభివృద్ధికి దోహదపడే పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌కు కూటమి ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా నోవాటెల్ హోటల్‌కు బయలుదేరి, అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి ఒక ముఖ్య సమావేశంలో పాల్గొన్నారు.

నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఇంధన సంస్థ రెన్యూ పవర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక శక్తి రంగం మరింత బలపడనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తర్వాత మంత్రి నారా లోకేశ్ విశాఖ ఐటీ హిల్స్ ప్రాంతంలో పర్యటించారు. నగరాన్ని ఐటీ రంగంలో కొత్త ఎత్తులకు తీసుకెళ్లే లక్ష్యంతో పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఇందులో రహేజా ఐటీ స్పేస్, దానికి అనుబంధ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, అలాగే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణ పనులు ప్రధానంగా ఉన్నాయి.

అదనంగా, మరోకొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటుకు కూడా భూమిపూజ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత విశాఖ దేశంలో అగ్రశ్రేణి ఐటీ హబ్‌గా అవతరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com