ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- November 13, 2025
విశాఖపట్నం: ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని నోవాటెల్‌లో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోంది. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని చంద్రబాబు అన్నారు.
గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించాం. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని, ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించింది. దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నాం. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలి. అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగింది. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో మేం బలంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు.
రైల్వే నెట్వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నాం. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోంది. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చాంమని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







