విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- November 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్(Aadhaar) వివరాలను సులభంగా సరిచేసుకునేందుకు పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్డేట్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమం నవంబర్ 17 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆధార్ వివరాల్లో ఉన్న పొరపాట్లు సరిచేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని (వేలిముద్రలు, కంటి స్కాన్) నవీకరించడం వంటి సేవలు(UIDAI) అందుబాటులో ఉండనున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లకు అధికారిక సూచనలు పంపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలలోనే ఈ అప్డేట్ సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని అధికారుల విజ్ఞప్తి. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







