చండీగఢ్‌లో నీటిపై తేలే సౌర విద్యుత్‌ కర్మాగారం

- July 24, 2016 , by Maagulf
చండీగఢ్‌లో నీటిపై తేలే సౌర విద్యుత్‌ కర్మాగారం

నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ కర్మాగారాన్ని చండీగఢ్‌లో ప్రారంభమైంది. నగరాన్ని సౌర విద్యుత్‌ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఈ 10 కేడబ్ల్యూపీ సామర్థ్య ప్లాంట్‌ను ధనాస్‌ సరస్సులో దీన్ని ఏర్పాటు చేశారు. సరస్సు శుద్ధి కోసం చేపట్టే ఏరేషన్‌ ప్రక్రియలోని ఫౌంటెయిన్లకు విద్యుత్‌ సరఫరా చేసేలా దీన్ని రూపొందించారు. ఇందులో దేశీయంగా రూపొందించిన డ్యుయెల్‌ యాక్సిస్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఫలితంగా నేలమీద ఏర్పాటు చేసే సంప్రదాయ ఫొటోవోల్టాయిక్‌ సౌర కేంద్రాల కన్నా 30 శాతం అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
నమూనా సౌర విద్యుత్‌ నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం చండీగఢ్‌ను ఇప్పటికే ఎంపిక చేసింది. దీనికింద 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సౌర విద్యుత్‌ వాటా 100 గిగావాట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com