ఖతార్‌లో ఐదు రిజర్వాయర్‌ల నిర్మాణం పూర్తి..!!

- November 13, 2025 , by Maagulf
ఖతార్‌లో ఐదు రిజర్వాయర్‌ల నిర్మాణం పూర్తి..!!

దోహా: ఖతార్‌లో శుద్ధి చేసిన నీటి కోసం ఐదు రిజర్వాయర్‌ల నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ‘అష్ఘల్’ ప్రకటించింది. నీటి వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్లు అష్ఘల్‌లోని డ్రైనేజ్ నెట్‌వర్క్స్ ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ వాలెద్ అల్ ఘౌల్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 22.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఐదు రిజర్వాయర్‌ల (లగూన్‌లు) నిర్మాణం జరిగిందన్నారు. ఈ రిజర్వాయర్‌లకు దోహా సౌత్ సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుండి పెరుగుతున్న ప్రధాన (డి-లైన్) ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తామని ఆయన అన్నారు.

వేసవి నెలల్లో శుద్ధి చేసిన నీటి డిమాండ్ పెరుగుందని, గ్రీనరిని పెంచుటకు, పబ్లిక్ పార్కులు మరియు రోడ్ల వెంట డెకరేషన్ మొక్కలు మరియు పశుగ్రాస పొలాలను సరఫరా చేయడానికి పునర్వినియోగ నీటిని వింటర్ లో నిల్వ చేస్తారని ఇంజినీర్ వాలెద్ వివరించారు.  

ఈ ప్రాజెక్టులో 6 కి.మీ. యాక్సెస్ రోడ్డు మరియు 25 కి.మీ. పొడవైన అంతర్గత రోడ్డు నెట్‌వర్క్ నిర్మాణం ఉన్నాయి. జలాశయాలను సరఫరా చేయడానికి మరియు వాటి మధ్య నీటిని రవాణా చేయడానికి అవసరమైన హైడ్రాలిక్ భాగాలతో సహా మొత్తం 8 కి.మీ. నీటి పైపులైన్లు కూడా వేశారు. దీంతోపాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు మరియు ఇతర సౌకర్యాలతో పాటు ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం 8 భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com