దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- November 15, 2025
దుబాయ్ః నవంబర్ 15, 16తేదీల్లో జరిగే T100 ట్రయాథ్లాన్ ప్రపంచ ఛాంపియన్షిప్ నేపథ్యంలో వాహనదారుల కోసం దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక అడ్వైజరీని జారీ చేసింది. నవంబర్ 16న అల్ అథర్ స్ట్రీట్ - అల్ హదికా రోడ్ మరియు అల్ మైడాన్ రోడ్లలో ఉదయం 6:45 నుండి 8:30 వరకు, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
అలాగే, అల్ అథర్ స్ట్రీట్ - అల్ హదికా రోడ్ మరియు అల్ మైడాన్ రోడ్ - అల్ మనామా స్ట్రీట్ లో ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను అనుంతించరని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించింది. మరోవైపు, సాలిక్ కూడా టోల్ రేట్లను సవరించింది. ఇక వార్షిక ఈవెంట్ అయిన T100 ట్రయాథ్లాన్ లో భాగంగా అథ్లెట్లు 2 కి.మీ ఈత కొట్టడం, తరువాత ఎడారిలో 80 కి.మీ రైడ్, నగరంలో 18 కి.మీ పరుగుతో ఛాంపియన్షిప్ ముగుస్తుంది.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







