ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!

- November 16, 2025 , by Maagulf
ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!

కువైట్ః కువైట్ లోని ఫర్వానియా ప్రాంతంలో భద్రతా అధికారులు రెండు చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించారు. ఈ మేకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఆసియా జాతీయతకు చెందిన నలుగురు వ్యక్తులు భద్రతా అధకారులు అరెస్టు చేశారు..అనుమానితుడు లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.  
ఇక రెండవ కేసులో, డబ్బుకు బదులుగా ప్రభుత్వ మందుల అక్రమ డెలివరీలో పాల్గొన్న నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. అధికారులు ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తులో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఆసియా నివాసి తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుని మందులను దొంగిలించి నిందితులకు సరఫరా చేశాడని తేలింది. దీనితో ఈ కేసులో పాల్గొన్న మొత్తం వ్యక్తుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
అనుమానితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు స్వాధీనం చేసుకున్న మందులను సురక్షితంగా ఉంచడానికి మరియు డాక్యుమెంట్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంతో సమన్వయంతో పనిచేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com